టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటి ఆకృతి అగర్వాల్ తమ ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు. భవిష్యత్తుపై తమ లక్ష్యాలు, పరిస్థితులు భిన్నంగా ఉండటంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆకృతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆకృతి ఏమన్నారు
విడిపోవడంపై ఆకృతి అగర్వాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తమ భవిష్యత్తు లక్ష్యాలు, బాధ్యతలు, పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం ఉన్నప్పటికీ తమ మార్గాలు ఇక కలిసి సాగడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అలాగే ఈ వ్యక్తిగత విషయంపై అభిమానులు, ప్రజలు ఊహాగానాలు చేయవద్దని, తమ గోప్యతను గౌరవించాలని ఆకృతి కోరారు.