అమెరికా ప్రభుత్వం పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ () కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం భారత ఐటీ రంగంలో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వల్ల భారత ఐటీ కంపెనీల కార్యకలాపాలపై తక్షణ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అమెరికాలో శాశ్వత నివాసం పొందాలని ఆశించే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
నాస్కామ్ మాజీ ఛైర్మన్, ఐటీ పరిశ్రమ నిపుణుడు డాక్టర్ గణేశ్ నటరాజన్ మాట్లాడుతూ, ఈ సస్పెన్షన్ హెచ్-1బీ వీసాలపై ప్రత్యక్ష ఆంక్షలు విధించలేదని, వీసా ఖర్చులను కూడా పెంచలేదని తెలిపారు. అందువల్ల తక్షణంగా భారత ఐటీ కంపెనీల వ్యాపార కార్యకలాపాలు దెబ్బతినే అవకాశం పరిమితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే, అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఐటీ రంగంలో చేరే యువతకు గ్రీన్ కార్డు పొందే మార్గం కష్టతరం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కార్యక్రమం ప్రాముఖ్యత
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డు) కోసం యజమానులు స్పాన్సర్ చేసే ప్రక్రియలో కీలకమైన మొదటి దశ. అమెరికాలో అర్హులైన ఉద్యోగులు అందుబాటులో లేరని నిర్దిష్ట నియమాల ప్రకారం నిరూపించిన తర్వాత, విదేశీ ఉద్యోగి తరఫున యజమాని ఈ ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేస్తారు. ఈ ప్రక్రియ గ్రీన్ కార్డు పొందే మార్గంలో ముఖ్యమైన భాగం.











