బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల, పట్టణ అధ్యక్షులు జెండా ఆవిష్కరించి, తెలంగాణ తల్లికి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని నాయకులు తెలిపారు.
బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన పురస్కరించుకుని మండల అధ్యక్షులు సట్ల ప్రవీణ్, పట్టణ అధ్యక్షులు కుందారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి సెక్రెటరీ యునస్, మండల సెక్రెటరీలు నవీన్ కుమార్, విద్య సాగర్, పద్మారావు, సాయన్న, రియాజ్ అలీ, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విక్కి, సెక్రెటరీ తేజ, వార్డ్ మెంబర్ దయాకర్, బూత్ అధ్యక్షులు బండి మల్లేష్, పురుషోత్తం, కాంగ్రెస్ నాయకులు మాజీ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, వాహబ్, హరికృష్ణ, గడ్డం రవి, ఆరేపల్లి గంగాధర్, నానం నరేష్, పిప్పర అశోక్, మేక నాగేష్, షేరుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










