రాజంపేటలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభ్యున్నతికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అన్నారు. రాజంపేట జీఎంసీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలకు విద్య, ఉపాధి, సామాజిక భద్రతతో పాటు సంక్షేమ రంగాల్లో మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి ముస్లిం మైనారిటీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలయ్యాయని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలని, యువత స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.










