ప్రభుత్వ నాయకత్వంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధిలో మోదీ కృషిని ఆయన కొనియాడారు.
ప్రజా సేవను జీవిత ధ్యేయంగా చేసుకుని, నిబద్ధత, క్రమశిక్షణతో దేశ సేవలో ముందుకు సాగుతున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి, ప్రగతి దిశగా ముందుకు సాగుతోందని కొనియాడారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేశ అభివృద్ధి, భారత కీర్తిని ప్రపంచ నలుమూలలకు చాటేలా మోదీ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రాధాన్యతను చాటుతూ, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ మోదీ పనిచేస్తున్నారని తెలిపారు.











