కోట్లాది మంది ప్రజల ఓటు హక్కును ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సట్ల ప్రవీణ్ అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్లను తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ చర్యలను తీవ్రంగా నిరసిస్తూ, ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.











