జిల్లా వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, అవినీతి వ్యవహారాలు వెలుగులోకి రావడంతో అధికారులు కీలక చర్యలు చేపట్టారు. అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి వ్యవహారంపై విచారణ చేపట్టిన అధికారులు, పంచాయతీకి జమ కావాల్సిన పన్నులు, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అవినీతి కారణంగా పంచాయతీలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిధుల కొరతతో పారిశుధ్య కార్మికులు, ఇతర సిబ్బంది జీతాలు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా, ఉద్యోగుల ఈపీఎఫ్, ఎల్ఐసీ సొమ్ము కూడా జమ కాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











