ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డితో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన షర్మిలా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం సుమారు గంట పాటు కొనసాగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ప్రొద్దుటూరు పట్టణం, మండలాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, యువతలో నిరుద్యోగం వంటి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఇర్ఫాన్ బాషా, షర్మిలా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.










