తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లు, ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశించారు. గురువారం తిరుపతిలోని ఎస్.వి. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లు, భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర నిఘా ఉండేలా చూడాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట చర్యలు ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ సెంటర్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిరంతర నిఘా కొనసాగించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.











