స్థానిక ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను ఇకపై ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. దీనికోసం ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను ఇకపై ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విషయాన్ని అఫిడవిట్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు వెల్లడించింది. ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారిక వెబ్సైట్లో దీనికోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది.











