కడప: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, పోలింగ్ కేంద్రాల వద్ద యూట్యూబ్ ఛానళ్ల పేరుతో హంగామా చేస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డుతో ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాస్ ఉన్న జర్నలిస్టులకు మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
కడప నగరంతో జిల్లాలో రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు డీఐజీ కీలక సూచనలు చేశారు. యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో కొందరు పోలింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా హడావుడి చేస్తున్నారని, అలాంటి వారిపై నిఘా పెట్టామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు











