కడప నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ సమీక్షా సమావేశం జరిగింది. నూతన మేయర్ మట్లి సువర్ణ, కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు.
కడప శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన మేయర్ మట్లి సువర్ణతో పాటు, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ, కడప నగరంలో దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు. కడప నగర ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, ప్రతి కార్పొరేటర్ తమ డివిజన్ లో నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు.











