ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన అప్పుల లెక్కలకు, అసెంబ్లీలో చెబుతున్న లెక్కలకు పొంతన లేదని, ఇది ప్రజలను మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు.
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కూటమి ప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 14 లక్షల కోట్ల అప్పు చేసిందని ప్రచారం చేసిన కూటమి నేతలు, అసెంబ్లీలో మాత్రం రూ. 7 లక్షల కోట్లు అని చెప్పడంపై ఆయన నిలదీశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బుగ్గన అందించిన గణాంకాల ప్రకారం, రాష్ట్రంపై ఉన్న మొత్తం రూ. 7 లక్షల కోట్ల అప్పులో, 2019 నాటికి (టీడీపీ హయాంలో) సుమారు రూ. 3 లక్షల కోట్లు ఉందని తెలిపారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన అప్పు కేవలం రూ. 3.5 లక్షల కోట్లు మాత్రమేనని, ఇది చంద్రబాబు హయాంతో పోలిస్తే అప్పుల వృద్ధి రేటు తక్కువగా ఉందని ఆయన వివరించారు.









