దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు, అనంతరం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మధ్యాహ్న సమయానికి సెన్సెక్స్ సుమారు 300 పాయింట్లు నష్టపోయింది. చమురు ధరలు మళ్లీ పెరగడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
మంగళవారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ దాదాపు 130 పాయింట్లు, నిఫ్టీ సుమారు 60 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు లాభాలను కోల్పోయాయి. గత సెషన్లో నిఫ్టీ 23,414.30 వద్ద ముగిసింది. వరుసగా నాలుగో సెషన్లోనూ రికవరీ కొనసాగినప్పటికీ, మార్కెట్లో అప్రమత్తత కనిపించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముడిచమురు ధరల పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధర 0.51 శాతం పెరిగి బ్యారెల్‌కు 100.85 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ ముడిచమురు ధర 96.19 డాలర్లకు పెరిగింది. నాలుగు రోజుల పాటు చమురు ధరలు తగ్గిన తర్వాత మళ్లీ పెరగడం భారత మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.











