శోచనీయం (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 08
దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, శాసన వ్యవస్థ గౌరవానికి విరుద్ధమని ఆయన అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్ కామారెడ్డి ,దళిత స్పీకర్‌పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు శోచనీయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, శాసన వ్యవస్థ గౌరవానికి విరుద్ధమన్నారు శాసనసభ స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైనదని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై కులపరమైన లేదా అవమానకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని అన్నారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ తాత మధు తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి, శాసన మండలి నిబంధనల ప్రకారం తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆయన స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉన్నప్పటికీ, వ్యక్తిగత అవమానాలు, కుల వివక్షకు తావులేదన్నారు. ఇటువంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదన్నారు ఇకనైనా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు తక్షణమే దళిత స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు











