తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
స్పీకర్ కార్యాలయం నుంచి వెలువడిన సమాచారం ప్రకారం, ఇరువురు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లలో, ఇప్పటికే ఎనిమిది మందికి క్లీన్చిట్ లభించగా, తాజాగా దానం, కడియంపై వాదనలు ముగిసిన తర్వాత ఈ తీర్పు వెలువడింది. దీంతో పది మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు నుంచి విముక్తి లభించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దానం నాగేందర్, కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఆయనపై బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా, కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడాన్ని ప్రశ్నిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై స్పీకర్ విచారణ జరిపి, తుది నిర్ణయం ప్రకటించారు.









