అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్, తన ఆత్మీయ మిత్రుడు జై షాకు మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ పరిపాలనలో జై షా సాగించిన ప్రయాణం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
క్రికెట్ పరిపాలనలో జై షా సాగించిన విశేష ప్రయాణం అభినందనీయమని పేర్కొన్న నారా లోకేష్, భారీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ ఆయనలో కనిపించే వినయం, ఆత్మీయత, నిరాడంబరత తనను వ్యక్తిగతంగా ఎంతో ఆకట్టుకుంటాయని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
క్రికెట్ పరిపాలనలో జై షా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఆయన చేస్తున్న కృషి విజయవంతం కావాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.











