ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కొత్త దశలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని నగరాలు, వార్డులు, గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కొత్త దశ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నగరాలు, వార్డులు, గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం, విద్యా సంస్థల్లో స్వచ్ఛ పాఠశాల వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలాగే, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒక రోజు-ఒక గంట స్వచ్ఛతా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఒక చెట్టు అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఈ స్వచ్ఛతా కార్యక్రమాల పురోగతిని ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లు కూడా ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి









