ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో కీలక మార్పులు చేసింది. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ ప్రభుత్వ సేవలు, ఇతర ప్రయోజనాల కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డులను నివాస రుజువుగా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో ప్రతి చిన్న అవసరానికీ ప్రత్యేకంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది.
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన సవరణ ఉత్తర్వుల ప్రకారం, సాధారణ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, సేవలు తదితర అవసరాలకు ఆధార్ లేదా రేషన్ కార్డును నివాస ధ్రువీకరణగా పరిగణించనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్ని నియామకాలు, సైనిక దళాల రిక్రూట్మెంట్ వంటి నిర్దిష్ట అవసరాల కోసం అధికారిక రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం కావచ్చు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తహసీల్దార్లకు మళ్లీ అధికారం
రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీ అధికారాన్ని ప్రభుత్వం మళ్లీ తహసీల్దార్లకు అప్పగించింది. అవసరమైన సందర్భాల్లో ప్రజలు ఆధారాలతో తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన పత్రాలు అందుబాటులో లేకపోతే, స్థానికంగా విచారణ నిర్వహించి నివాసాన్ని ధ్రువీకరించిన అనంతరం సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.










