మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విగ్రహం, స్మారక పార్క్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి న ఆవిష్కరించారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గచ్చిబౌలి విప్రో జంక్షన్ వద్ద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ స్మారక పార్క్‌ను నిర్మించారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించాయని గుర్తుచేశారు.










