జమ్మూకశ్మీర్‌లో రానున్న రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అక్టోబర్ 7 నుంచి 10 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, అక్టోబర్ 7 నుంచి 10 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం కొన్ని ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉంది. అక్టోబర్ 7 నుంచి 13 వరకు మాత్రం ఎలాంటి ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇప్పటికే కశ్మీర్‌లోని కొన్ని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురిసింది. అఫర్వట్ నుంచి జోజిలా వరకు కొండ ప్రాంతాల్లో మంచు నమోదవగా, శ్రీనగర్ సహా లోతట్టు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసినట్లు అధికారులు తెలిపారు.











