కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. కాంగ్రెస్ నాయకులను ముక్కలుగా నరికి అరేబియా సముద్రంలో పడేస్తామంటూ బీజేపీ నేత చలవాది నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై స్పందించిన కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే, ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
కోలార్‌లో బీజేపీ నిర్వహించిన సేవ్ డెమోక్రసీ, ఎరాడికేట్ అనార్కీ పాదయాత్రలో పాల్గొన్న కర్ణాటక శాసన మండలి ప్రతిపక్ష నేత చలవాది నారాయణస్వామి కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాన్ని సృష్టిస్తే, బీజేపీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ నేతలను ముక్కలుగా నరికి అరేబియా సముద్రంలో పడేస్తారని ఆయన హెచ్చరించినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై బహిరంగంగా హింసను ప్రేరేపించేలా మాట్లాడటం సరికాదని ప్రశ్నించారు. బెంగళూరులో ఆయన నివాసం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగగా, వారిలో కొందరిని పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకున్నారు.











