మహబూబ్‌నగర్
జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రతి ఏడాది జరిగే ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సంబంధిత శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.











