అన్ని
రాష్ట్రంలో భూగర్భజలాల పరిరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలను అధ్యయనం చేసి, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ ఈ ఆదేశాలు జారీ చేశారు. కరువు ఉపశమన చర్యలు, భూగర్భజల సంరక్షణ పనులకు కార్యాచరణ ప్రణాళిక ఖరారుపై చర్చించేందుకు ఒక ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, నీటిపారుదల శాఖలు చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా సమీక్షించారు.











