సంప్రదాయ పంటల సాగులో సరైన ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు పండిస్తే మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉందని కర్ణాటకకు చెందిన రైతు కరిగౌడ నిరూపిస్తున్నారు. బెంగళూరు జిల్లాలోని కార్లపుర పాళ్యకు చెందిన ఆయన, సుమారు మూడున్నర ఎకరాల్లో చిన్న సొరకాయలను సాగు చేస్తూ ఖతార్ మార్కెట్‌కు సరఫరా చేస్తున్నారు.
సాధారణంగా పెద్దగా పెరిగిన తర్వాత కోసే సొరకాయలను, విదేశీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేత దశలోనే కోస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విదేశీ మార్కెట్ అవసరాన్ని గుర్తించి సాగు
కరిగౌడ కుటుంబం తరతరాలుగా వ్యవసాయం చేస్తోంది. ఆయన తాత, తండ్రి కూడా రైతులే. చదువు పూర్తయ్యాక వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకున్న కరిగౌడ మొదట మొక్కజొన్న, టమాటా, వంకాయ వంటి సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. అయితే స్థానిక మార్కెట్లలో పంటకు ఆశించిన ధర రాకపోవడం సమస్యగా మారింది. దీంతో సాధారణ పంటలకు భిన్నంగా, ప్రత్యేక మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలను పండించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విదేశాల్లో చిన్న పరిమాణంలో ఉండే సొరకాయలకు గిరాకీ ఉందని తెలుసుకుని, వాటి సాగుపై దృష్టి పెట్టారు.











