ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు సంబంధించి అధికారులు బుల్డోజర్లతో నిర్మాణాలను కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చర్యతో స్థానికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 44 ఆస్తులు ప్రభావితమైన ఈ కేసు తదుపరి విచారణ సుప్రీంకోర్టుకు చేరనుంది.
నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆక్రమణల తొలగింపు చర్యల్లో భాగంగా పలు నిర్మాణాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ ఆకస్మిక చర్యతో స్థానికుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. ముఖ్యంగా, మహిళలు కన్నీటి పర్యంతమవుతూ అధికారుల తీరును వ్యతిరేకించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సెంట్రల్ మార్కెట్లో మొత్తం ఆరు భవనాలను కూల్చివేసినట్లు సమాచారం. నిర్మాణాల తొలగింపు కోసం భారీ యంత్రాలను వినియోగించారు. జేసీబీలు సరిపోకపోవడంతో పెద్ద పోర్క్లైన్ యంత్రాన్ని కూడా అక్కడికి తరలించినట్లు తెలిసింది.











