తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్‌పై లంచం ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అవినీతి నిరోధక విభాగం (డీవీఏసీ)కు ఆదేశాలు ఇవ్వాలని చెన్నైకి చెందిన న్యాయవాది కె. శివసుబ్రహ్మణ్యం ఈ పిటిషన్లో కోరారు.
పిటిషన్ వివరాల ప్రకారం.. న తమిళనాడు శాసనసభలో పాఠశాల విద్య, ఉన్నత విద్య శాఖలపై జరిగిన చర్చ సందర్భంగా మేరీ విల్సన్ గత ప్రభుత్వ హయాంలో విద్యాసంస్థలకు అవసరమైన అనుమతులు, గుర్తింపులు పొందేందుకు లంచం చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నట్లు పిటిషనర్ తెలిపారు. తాను కూడా ఆ వ్యవహారంలో బాధితుడినని, లంచం చెల్లించినట్లు మంత్రి సభలో చెప్పారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంత్రి చేసిన వ్యాఖ్యల ఆధారంగా అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత నిబంధనల కింద దర్యాప్తు జరగాల్సి ఉందని పిటిషనర్ వాదించారు. ముఖ్యంగా లంచం ఇవ్వడం కూడా చట్టపరంగా నేరమేనని, అందువల్ల మంత్రి సభలో చేసిన వ్యాఖ్యలను పరిశీలించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.











