మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్, పార్టీ అధిష్ఠానానికి తన వివరణను సమర్పించారు. డిన్నర్ పార్టీకి హాజరయ్యానని, డ్రగ్స్ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలుంటాయని హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా ఎంపీ మహేశ్ పార్టీ అధిష్ఠానానికి వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మహేశ్ ఖండించారు. కేవలం ఒక డిన్నర్ పార్టీకి హాజరయ్యానని, అందులో డ్రగ్స్ సేవించలేదని ఆయన తన వివరణలో పేర్కొన్నట్లు సమాచారం. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.










