జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజంపేట మండల జనసేన నాయకులు బద్రి స్వామి ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత విజయాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం కామారెడ్డిలోని రెయిన్బో బ్లడ్ సెంటర్లో బద్రి స్వామి స్వచ్ఛందంగా రక్తదానం చేసి, క్యాన్సర్ బాధితుల కోసం రక్త యూనిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా బద్రి స్వామి మాట్లాడుతూ.. పదవుల కోసం కాకుండా పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం పనిచేయాలని, ప్రజాహితం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జనసేన కార్యకర్తలు ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు కంచర్ల నర్సా గౌడ్, పత్రి శంకర్, ఆశయాల స్వామి, సంగి రవి, మలయాళ ప్రభాకర్‌తో పాటు రాజంపేట మండల నాయకులు కుంబాజి నరేష్, కోతి బాలరాజ్, కొప్పుల రవి, బల్లా రవి, రాజు, సాయిరాజ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.