వై.ఎస్.ఆర్ కడప, 9 September
రాజంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీడీపీలో ఛైర్మన్ పదవి కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. రిజర్వేషన్లను బట్టి టికెట్ల కేటాయింపులు జరగనున్నాయి. ఈ పదవి కోసం పలువురు నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజంపేట: మున్సిపల్ ఛైర్మన్ కోసం టిడిపి లో ఆశావహులు డిస్టిక్ బ్యూరో ఇంచార్జ్ కడప : మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండటంతో రాజంపేట అధికార పార్టీ టీడీపీలో ఛైర్మన్ పదవికోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. ఓసీకి రిజర్వ్ అయితే దంత వైద్యుడు దగ్గుపాటి నవీన్ కుమార్, ఆర్థోపెడిక్ వైద్యుడు మద్దిపట్ల మారుతి, అడ్వకేట్ కొండూరు శరత్ కుమార్ రాజు, గుగ్గిళ్ల చంద్రమౌళి తదితరులు ముందుకు వస్తుండగా, బీసీకి రిజర్వేషన్ వస్తే సీనియర్ నేత డాక్టర్ చెన్నూరు సుధాకర్, అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి.











