రాజంపేట, 9 September
ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. బుధవారం నాడు మండలం, ఆకేపాడు గ్రామంలో నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు - తెదేపా ఇన్చార్జ్ చమర్తి జగన్.. డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప: సెప్టెంబర్(19). ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. బుధవారం నాడు రాజంపేట మండలంలో నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పథకాలను చమర్తి జగన్ మోహన్ రాజు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు ఏకష్టం వచ్చినా, నష్టం వచ్చినా వాటి పరిష్కారం కోసం ఎల్లవేలలా ప్రభుత్వం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చామర్తి వెంట తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.











