మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అప్పుల విధానాలను ప్రశ్నిస్తూ, రాష్ట్రాన్ని ఆర్థికంగా విద్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండేళ్లలోనే భారీగా అప్పులు చేసిందని ఆరోపించారు. తన ఐదేళ్ల పాలనలో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలో రూ.3.20 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ అంకెలతో ఎవరు రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభంలోకి నెడుతున్నారో స్పష్టమవుతుందని జగన్ అన్నారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.









