మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్లక్ష్యం చేయడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలను ఆమె కుట్రగా అభివర్ణించారు.
మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, మిట్టల్ స్టీల్ కు రూ.25 వేల కోట్ల రాయితీ, 15 ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు, విద్యుత్ యూనిట్ కు రూ.1 రాయితీ వంటి అనేక ప్రయోజనాలు కల్పించడాన్ని షర్మిల ప్రశ్నించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అంతేకాకుండా, ఆ సంస్థకు సొంత పోర్ట్, నీటి సౌకర్యాలు కల్పించడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఈ రాయితీలు, సౌకర్యాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను దెబ్బతీసేందుకేనని ఆమె ఆరోపించారు.










