వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) తన 15వ వార్షికోత్సవాన్ని గురువారం తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని ఆయన అన్నారు.
వైఎస్సార్సీపీ 15వ వార్షికోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించిందని, వైఎస్సార్సీపీ ఆవిర్భావం దేశ రాజకీయాల్లోనే మార్పు తెచ్చిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నల్లకాల్వలో ఇచ్చిన మాట వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి కారణమైందని, ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చిందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ కోట్లాది మంది ప్రజల పార్టీ అని, తాను ఎల్లప్పుడూ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నానని, విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.









