ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026 హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగించింది. సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 8-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి, లీగ్ దశను అజేయంగా ముగించింది.
భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ 8వ నిమిషంలో తొలి గోల్ సాధించాడు. 11వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ మరో గోల్ చేయగా, 15వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో తొలి క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గోల్స్ వర్షం కురిపించిన భారత్
మూడో క్వార్టర్లో భారత్ మరింత దూకుడుగా ఆడింది. 33వ నిమిషంలో షిలానంద్ లక్రా, 34వ నిమిషంలో సుఖ్జీత్ సింగ్, 36వ నిమిషంలో సంజయ్ గోల్స్ సాధించారు. 40వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ మరో గోల్ చేసి తన ఖాతాలో రెండో గోల్ నమోదు చేశాడు. చివరి నిమిషంలో అంగద్ బీర్ సింగ్ గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యం 8-0కు చేరింది. దక్షిణ కొరియా జట్టుకు ఒక్క గోల్ కూడా చేయడం సాధ్యపడలేదు.












