ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమకారుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా విశిష్ట సేవలు అందించారని, ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ఆదివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయన జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, రాష్ట్ర సాధన కోసం దీక్ష చేపట్టడంతో పాటు తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని ఉద్యమానికి అండగా నిలిచారని గుర్తుచేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన జీవితాంతం కృషి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. సమాజంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన ఆస్తులను దానం చేసిన త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు.











