తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని సి.ఎస్. చర్చి ఎదుట ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజా నాయకుడిగా బాపూజీ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని గిరి పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. బాపూజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.












