జిల్లా కేంద్రంలోని 22, 23, 24 వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో పర్యటించి పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి సమస్యలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కేంద్రంలోని 22, 23, 24 వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో పర్యటించి పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి సమస్యలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వార్డుల్లో సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్లు యూనుస్, సిద్ధిక్, వాజీద్, సత్యం, డీఈ హన్మంతరావు, ఏఈ వేణుప్రసాద్, టీపీఓ దేవరాజు, టీపీబీఓ మల్లికార్జున్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











