ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఇకపై ఒకరే వైస్ ఛైర్మన్, ఉపాధ్యక్షులు ఉండేలా చేసిన చట్ట సవరణ ఈ నెల 25 నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఇకపై ఒకరే వైస్ ఛైర్మన్, ఉపాధ్యక్షులు ఉండేలా చేసిన చట్ట సవరణ ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జడ్పీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లు, మండల పరిషత్‌లో ఇద్దరు ఉపాధ్యక్షులు ఉండేవారు. ఇప్పటివరకు ఉన్న ఇద్దరు వైస్ ఛైర్మన్లను, ఉపాధ్యక్షులను ఒకరికి తగ్గిస్తూ చేసిన చట్ట సవరణ బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించింది. తాజాగా ఆ సవరణకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.












