తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు మంగళవారం బాన్సువాడలోని డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బాన్సువాడలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో మరెక్కడా జరగలేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులకు సమీపంలో ఉన్న బాన్సువాడలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించడం ఎంతో ప్రయోజనకరమన్నారు. సీనియర్ జర్నలిస్టుల అనుభవాలను పంచుకోవడం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం, దాని ఆవిర్భావం, వార్తల విశ్వసనీయతపై జర్నలిస్టులు చర్చించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వార్తలు రాసేటప్పుడు వాస్తవాలను నిర్ధారించుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ () వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. జర్నలిస్టులు వృత్తిపరమైన హద్దులను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.












