కడప రిమ్స్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించకుండా, పీఎఫ్, ఈఎస్ఐ కట్ చేస్తున్నా సరైన సేవలు అందించడం లేదని ఏఐటీయూసీ ఆరోపించింది. కార్మికులను కుంటి సాకులు చెప్పి తొలగిస్తూ, అక్రమ నియామకాల ద్వారా లక్షల రూపాయలు దండుకుంటున్న ఏజెన్సీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసి బాదుల్లా డిమాండ్ చేశారు.
ఆదివారం స్థానిక హోచిమిన్ భవన్ యందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసి బాదుల్లా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేని విధంగా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యంపై రిమ్స్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముఖ్యంగా, ఎంవోయూ ప్రకారం రూ. 18,600కు గాను పీఎఫ్, ఈఎస్ఐ పోను రూ. 13,960 ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ. 12,100 మాత్రమే ఇవ్వడం దారుణమని తెలిపారు. అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయనే ధైర్యంతో ఏజెన్సీలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిబంధనల ఉల్లంఘన, బెదిరింపులు












