వైఎస్ఆర్ కడప జిల్లా, చక్రాయపేట మండలం, కుమారకల్వ గ్రామంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మిద్దెలు కూలిపోవడంతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ మైనారిటీ నాయకుడు మితాయిగిరి కరీముల్లా కోరారు. ఈ సంఘటనలో సయ్యద్ ఇబ్రహీం సాహెబ్, సదాని, శాకలి వెంకటరమణ (చిన్నోడు) కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి.
బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని టీడీపీ మైనారిటీ నాయకుడు మితాయిగిరి కరీముల్లా తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే గ్రామానికి చేరుకుని కూలిపోయిన ఇళ్లను పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి తగిన పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.












