అమరావతి, జులై 02
రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం (అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్) అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.
రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం (అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్) అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.
న్యాయవాదుల భద్రత, గౌరవం, విధి నిర్వహణకు అవసరమైన చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకతను ప్రతినిధులు వివరించారు. వారి వినతిని సానుకూలంగా స్వీకరించిన మంత్రి ఎన్ఎండీ ఫరూక్, దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.












