హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారనుంది. ఈ ప్రభావంతో శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రజలను, ముఖ్యంగా రైతులను అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్యంగా కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లోని ప్రజలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సంభవించవచ్చు.












