కామారెడ్డి పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహించేందుకు వెళ్తున్న గ్యాస్ గోదాం వాచ్మెన్ ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి తలకు తీవ్ర గాయమై మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయలేదు.
కామారెడ్డి జిల్లా లింగంపేట లింగంపేట మండలం అయ్యపల్లి గ్రామానికి చెందిన పిట్ల బాలయ్య (54), పిట్ల నారాయణ కుమారుడు. ఆయన సిరిసిల్ల రోడ్డులోని సివిల్ సప్లై భారత్ గ్యాస్ గోదాంలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రోజువారీ విధుల్లో భాగంగా ఇంటి నుంచి డ్యూటీకి బయలుదేరిన బాలయ్య, మార్గమధ్యంలో కామారెడ్డి వీక్లీ మార్కెట్లో అద్దెకు నివాసముంటున్న తన పెద్ద కుమార్తె భార్గవి, అల్లుడు సాయిబాబా ఇంటికి వెళ్లి, తిరిగి విధులకు కాలినడకన బయలుదేరారు.












