వై.ఎస్.ఆర్ కడప, 11 September
తిరుపతిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగిన ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న పాడుబడిన బావిలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తిరుపతిలో విషాదం: సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరు వలస కూలీలు మృతి డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప సెప్టెంబరు11. తిరుపతిలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగిన ఇద్దరు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ (SBI) ట్రైనింగ్ సెంటర్ వెనుక భాగంలో ఉన్న ఒక పాడుబడిన బావిలో ఈ ప్రమాదం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన భీమ్ రాజ్ (36), నరేష్ (21) అనే ఇద్దరు వలస కూలీలు ఇక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన సెల్ ఫోన్‌ను తీసేందుకు భీమ్ రాజ్ దుప్పట్లు కట్టుకుని లోపలికి దిగాడు. అయితే, బావిలోని ప్రమాదకర విషవాయువు పీల్చడంతో అతడు స్పృహతప్పి పడిపోయాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో, అతడిని కాపాడేందుకు నరేష్ కూడా బావిలోకి దిగాడు. ఊపిరాడకపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు, ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషవాయువుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో 'పాతాళబేరి' సహాయంతో మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అలిపిరి సీఐ రామకిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










