మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో పద్మశాలి గణేష్ మండపం వద్ద మహిళల రంగవల్లిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
పద్మశాలి గణేష్ మండపం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రంగవల్లిక కార్యక్రమంలో మహిళలు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. రంగురంగుల ముగ్గులతో మండపం పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమం మహిళలను ఎంతగానో అలరించింది. ఈ రంగవల్లిక పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సుమలత, లహరి వ్యవహరించారు. పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిని గుండుక సుకన్య, రెండవ బహుమతి దీకొండ లావణ్య, మూడవ బహుమతి అల్వాల రేణుక గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు మ్యాక నరేందర్, ఉపాధ్యక్షుడు చిలువేరీ మోహన్, ప్రధాన కార్యదర్శి జిందం రాజు, సలహాదారుడు శివకుమార్ తో పాటు పలువురు సభ్యులు హాజరయ్యారు. వారు విజేతలను అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










