జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( - జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త డిమాండ్ల దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.
( జిల్లా అధ్యక్షుడు వి. రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి టి. రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ మాట్లాడుతూ, మీడియా రంగంలో పనిచేస్తున్న విలేకరుల రక్షణకు ప్రత్యేక చట్టాలు లేకపోవడం విచారకరమన్నారు. భారత రాష్ట్రపతితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
1982 తర్వాత వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాను పరిగణనలోకి తీసుకుని నూతన మీడియా కమిషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని వారు అన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న శారీరక దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులు వంటి ఘటనల నేపథ్యంలో జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక జాతీయ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని వారు అన్నారు.












