దివ్యాంగుల సంక్షేమానికి అండగా నిలిచిన రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, ఐదుగురు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేసి మానవత్వం చాటుకున్నారు. మదనపల్లెలోని ఎంపీ కార్యాలయంలో ఈ వాహనాలను పంపిణీ చేశారు.
మదనపల్లెలోని ఎంపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మండలం బూరగమంద గ్రామపంచాయతీకి చెందిన పచ్చిపాల రామమూర్తి, చౌడేపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బి. నవీన్, అన్నిపల్లి గ్రామానికి చెందిన రామచంద్ర రెడ్డి, కలికిరి మండలం గుండ్లూరు గ్రామపంచాయతీకి చెందిన అర్బాస్, బి. కొత్తకోటకు చెందిన టి. రాజశేఖర్ కు వారి వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాలను అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వికలాంగులు స్వావలంబనతో జీవించేందుకు ఈ మూడు చక్రాల వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని ఎంపీ తెలిపారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు.












