మండలం: వేల్పుగొండ గ్రామంలో పితృ అమావాస్య సందర్భంగా ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అందంగా అలంకరించి పూజలు చేశారు.
గ్రామంలోని మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కొనసాగిస్తూ గ్రామస్థులు ఈ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.












